‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?

‘వార్ 2’ పై ఎన్టీఆర్ మౌనం వీడేనా..?

Published on Aug 20, 2025 2:31 AM IST

బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన క్రేజీ చిత్రం ‘వార్ 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇందులోని కంటెంట్ ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు.

దీంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తోంది. అయితే, ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేయడంతో అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. అయితే, ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా ప్రమోషన్స్ చేసినా, ఎందుకో వారికి ఈ సినిమా కనెక్ట్ కాలేదు. మరి ఈ సినిమా ఫెయిల్యూర్ దిశగా వెళ్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఏదైనా రెస్పాండ్ అవుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపై ఎన్టీఆర్ కంటెంట్, పాత్రలపై మరింత ఫోకస్ పెట్టాలని వారు కోరుతున్నారు.

తాజా వార్తలు