అఖిల్ విషయంలో ఆ తప్పు చేయను – నాగార్జున

అఖిల్ విషయంలో ఆ తప్పు చేయను – నాగార్జున

Published on Jan 1, 2014 8:47 AM IST

Nagarjuna-New-Photos-(18)
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్ నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన ప్రారంభించిన సినీ ప్రస్థానాన్ని ఆయన వారసులు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉన్నారు. ఇప్పటికే నాగార్జున కుమారుడు నాగ చైతన్య హీరోగా పరిచయమయ్యాడు. ఈ నూతన సంవత్సరంలో నాగార్జున మరో వారసుడు అక్కినేని అఖిల్ కూడా హీరోగా పరిచయమయ్యే అవకాశం ఉంది.

అఖిల్ ని మీరే నిర్మాతగా లాంచ్ చేస్తారా అని అడిగితే ‘ అవును నేనే చేస్తాను. నాగ చైతన్య విషయంలో తప్పు చేసాను. నిర్మాతగా నాకు అవకాశం ఉండి కూడా వేరే నిర్మాత చేతిలో పెట్టాను. అదే తప్పు అఖిల్ విషయంలో చేయను. అఖిల్ సినిమాకి నేనే నిర్మాతను కానీ దర్శకుడు, కథ విషయంలో మాత్రం నిర్ణయం వాడిదే. కావాలంటే ఏదన్నా సలహాలు ఇస్తాను. అఖిల్ ఎంట్రీ 2014లోనే ఉంటుందని అనుకుంటున్నానని’ నాగార్జున అన్నాడు.

తాజా వార్తలు