‘బాద్ షా’లో లాంటి పాత్రలు ఇక చేయను – నవదీప్

navdeep
ఇండస్ట్రీకి వచ్చి దాదాపు పదేళ్ళయ్యింది, చేసిన సినిమాలు ఎక్కువే కానీ కమర్షియల్ విజయాలు మాత్రం చాలా తక్కువ ఉన్న హీరో నవదీప్. మార్చి 7న రానున్న ‘బంగారు కోడిపెట్ట’ సినిమాతో కమర్షియల్ హిట్ కొడతానని నవదీప్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాజ్ పిప్పళ్ళ దర్శకుడు. మూవీ విడుదల సందర్భంగా మీడియా మిత్రులతో మాట్లాడిన నవదీప్ తన కెరీర్ లో చేసిన తప్పుల గురించి నిర్మొహమాటంగా చెప్పేసాడు.

నవదీప్ మాట్లాడుతూ ‘ చందమామ సినిమాతో విజయం అందుకున్న తర్వాత కొన్ని ప్రత్యేక పాత్రలే చేయాలనే ఉద్దేశంతో ఒక ఏడాది ఖాళీగా ఉన్నాను. అలాగే పాత్రలను ఎంచుకోవడంలో నేను చేసిన పొరబాటు వల్లే ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను. అలాంటి సినిమాలు చేయకపోయి ఉంటే నా స్థానం వేరేలా ఉండేది. ఉదాహరణకి ఇటీవల చేసిన బాద్ షా. ఆ సినిమాలో నా పాత్రకి పెద్ద ప్రాధాన్యత లేదు ఆ పాత్ర నేనే కాదు ఎవరన్నా చేయవచ్చు. అందుకే ఇకముందు అలాంటి సినిమాలు చేయనని’ అన్నాడు.

Exit mobile version