వచ్చే ఏడాది హీరోలందరూ ఫుల్ బిజీ ?

వచ్చే ఏడాది హీరోలందరూ ఫుల్ బిజీ ?

Published on Jul 26, 2020 8:47 PM IST

కథ కొత్తగా ఉంటే ఆ సినిమా సగం హిట్ అయినట్టే. గత నాలుగైదు సంవత్సరాలుగా తెలుగు సినిమా కథకు కాలం కలిసొచ్చింది. మంచి మంచి కథలు వచ్చాయి. అందుకే ఈ లాక్ డౌన్ లో హీరోలందరూ మంచి కథలు గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు కథలను వినడానికి ఒక టీంను కూడా పెట్టుకుంటున్నారట. పైగా కరోనాతో కావాల్సినంత ఖాళీ టైమ్ దొరికింది అందరికీ. ఈ సమయాన్ని చక్కగా కథల కోసం సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారట మన హీరోలు.

గత కొన్ని నెలలుగా తీరిక లేక కొత్త కథలు వినలేకపోయిన హీరోలందరూ ఈ తీరిక సమయాన్ని సాంకేతిక ద్వారా డైరెక్టర్స్ అండ్ రైటర్స్ దగ్గర నుండి కథలు వినడానికి తమ సమయాన్ని కేటాయిస్తున్నారని.. అలాగే రచయితలకు లైన్ చెప్పి ఫుల్ స్క్రిప్ట్ రాయిస్తున్నారని తెలుస్తోంది. మెయిన్ గా తమకు ఎలాంటి కథలు కావాలో రచయితలకు, సన్నిహితులైన దర్శకులకు వివరంగా చెప్పి మరీ వారి చేత హీరోలు కథలు రాయించుకోవడం చూస్తుంటే.. వచ్చే ఏడాది హీరోలందరూ ఫుల్ బిజీగా ఉండనున్నారు.

తాజా వార్తలు