అజిత్-అల్లు అర్జున్ ఒకేరోజు తలపడనున్నారా?


స్టార్ హీరోలైన అల్లు అర్జున్ మరియు అజిత్ బాక్స్ ఆఫీసు వద్ద అమీతుమీ తెల్చుకోనున్నారా? జూలై 13న విడుదలవుతున్న వీరిద్దరి సినిమాలు చూస్తుంటే అలానే అలానే అనిపిస్తోంది. తమిళ సూపర్ స్టార్ అజిత్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది అంతేకాకుండా ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం తోడవడంతో ‘జులాయి’ మార్కెట్ ఇంకా పెరిగింది. .

వీళ్ళిద్దరి సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయి మరియు చాలా భారీ ఎత్తున ఈ రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలు భారీగా విడుదలవుతుండడంతో ఈ చిత్రాల మధ్యలో వేరేచిత్రాలు విడుదల చేయలేక కొంత మంది నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేస్తున్నారు. జులైలో విడుదలవుతున్నా పెద్ద పెద్ద చిత్రాల వల్ల చాలా సినిమాలు అనుకున్న తేదీకి విడుదల కావడం లేదు. చూద్దాం జులైలో ఎన్ని చిత్రాలు విడుదలువుతాయో? వాటి పలితం ఏమవుతుందో? తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాలి.

Exit mobile version