విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’. ఈ చిత్రం యొక్క బడ్జెట్ అనుకున్న దానికంటే 30% పెరిగిందని వార్తలు వస్తున్నాయి మరియు ఆ వార్తలను ఈ చిత్ర ప్రొడక్షన్ టీం దానికి ఎలా అంగీకరించారా? అని అందరూ అనుకుంటున్నారు.
దీని వెనుక ఉన్న అసలైన నిజం ఏమిటంటే ఒకానొక సమయంలో మేము అనుకున్న దానికంటే 30% బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే, ఈ సినిమాకి ఉన్న క్రేజ్ వల్ల మరియు అన్ని ఏరియాల్లో సినిమాకి భారీ అంచనాలు ఉండడంతో ఈ చిత్ర రెవిన్యూ కూడా ఎక్కువ వస్తుందని అంచనా వేస్తున్నాం, అలాగే ప్రొడక్షన్ కాస్త కూడా పెరిగింది. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా అమ్ముడు పోనంత అమౌంట్ కి ఈ చిత్ర ఆస్ట్రేలియా, యు.ఎస్ ఏ రైట్స్ అమ్ముడు పోయాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకి అంతే క్రేజ్ ఉంది.
ఒక కుటుంబ కథా నేపధ్యంలో ఒక సరికొత్త అనుభూతితో వస్తున్న ఈ చిత్రంలో పెద్ద హీరోలు వెంకటేష్ మహేష్ బాబు హీరోలుగా నటిస్తుండడంతో ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విడుదలైతే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం కానీ అవి ఎంత పెద్దవి అనే దానికోసమే మనం వేచి చూడాలి.