అందరూ అనుకున్నట్లే ఆర్ ఆర్ ఆర్ మూవీ దాదాపు ఆరు నెలలు వాయిదా పడింది. 2020 జులై 30 నుండి 2021 జనవరి 8కి పోస్ట్ ఫోన్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ మూవీ అనుకున్న విధంగా విడుదల అయ్యే అవకాశం లేదని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. షూటింగ్ మొదలైన కొన్నాళ్ళకు రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడం, రాజమౌళి కుమారుడి పెళ్లి కారణంగా మరో రెండు నెలలు విరామం తీసుకోవడం, బాహుబలి లండన్ ప్రదర్శన కొరకు రాజమౌళి అక్కడ ఓ రెండు వారాలు గడపడం ఇలా అనేక కారణాలతో అనుకున్న విధంగా చిత్రీకరణ జరగలేదు.
ఎన్నిసార్లు వాయిదా పడినా అనుకున్న ప్రకారం జులై 30న సినిమా విడుదల ఉంటుంది అని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ కూడా పూర్తి చేశాం, వాయిదా పడుతుంది అనే పుకార్లలో నిజం లేదు అని వారు పరోక్షంగా తెలియజేశారు. మరి సడన్ గా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఏకంగా ఆరు నెలలు ముందుకు జరపడం వెనుక అసలు కారణం ఏమిటనేది అర్థం కావడం లేదు. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి కాలేదా లేక, సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకొని భారీ వసూళ్లు రాబట్టాలని ఇలా చేశారా అనేది తెలియాలి.