రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ‘నాయక్’ ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. అయితే చరణ్ నిన్న ఆడియో ఫంక్షన్లో స్టేజి మీద చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. చరణ్ మీడియా లోని ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. చరణ్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడని ప్రశ్నిస్తే నిన్న జరిగిన ఆడియో విడుదల వేడుకకి చిరంజీవి ఢిల్లీలో ఉండి రాలేకపోయారు. అయన లేని లోటును పూడ్చేందుకు పవన్ కళ్యాణ్ ఈ వేడుకకి హాజరయ్యాడు. గతంలో జరిగిన రచ్చ ఆడియో వేడుకకి పవన్ రాకపోవడంతో మెగా ఫ్యామిలీలో కలహాలు అంటూ కొందరు మీడియా వారు వార్తలు రాసారు. అవి తన మనసును భాదించాయని, బాబాయ్ రాకపోతే మా మధ్య కలహాలు ఉన్నాయని ఎలా అంటారు, మేమంతా ఒకటే అంటూ చరణ్ ఎమోషనల్ గా మాట్లాడాడు. పవన్ చాలా మాట్లాడతాడని ఆయన అభిమానులు ఎంతో ఎదురు చూసారు కానీ అయన సింపుల్ గా నాలుగు ముక్కలు మాట్లాడి ముగించాడు. నాయక్ ఆడియో లాగే సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుందాం.