ఇటీవల మరోసారి ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ వరుసగా వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆ మధ్య లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ లో తను మాట్లాడుతూ చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో తను చేసిన కామెంట్స్ అంతకు మించి షాకింగ్ గా మారాయి.
ఓ హీరోని టార్గెట్ చేస్తూ చేసిన ఈ కామెంట్స్ చర్చకు దారి తీస్తుంది. సదరు హీరోని ఇమిటేట్ చేస్తూ బండ్ల గణేష్ మాట్లాడ్డం, ఆ హీరోకి బండ్ల గణేష్ కి ఏం చెడింది అనేది చర్చకు దారి తీసింది. మరి ఆ హీరో ఈ మధ్య కాలంలో ఓ సెన్సేషనల్ హీరోనే అన్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. మరి వీటిపై మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.
