మలయాళ స్టార్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు సెల్వమని సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం “కాంత” కూడా ఒకటి. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ లో మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. ఇక మేకర్స్ ఈ సినిమా తాలూకా ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు.
ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ప్రీ టీజర్ తో ఈ నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఆల్రెడీ ఇందులో దుల్కర్ సల్మాన్ సాలిడ్ పెర్ఫార్మన్స్ ని ప్రామిస్ చేసాడు. ఇక తనతో పాటుగా సముద్రకని తదితరులు నటిస్తుండగా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ లు నిర్మాణం వహించగా ఈ సినిమా ఈ నవంబర్ 14న రిలీజ్ కి తీసుకొచ్చారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
