ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. వచ్చే ఏడాది ఓ స్పెషల్ డే రోజున విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం రెండు రోజుల కితమే షూట్ ను కంప్లీట్ చేసుకుంది.
మరి ఇక్కడ నుంచి వకీల్ సాబ్ అప్డేట్స్ రెగ్యులర్ గా ఉంటాయని మేకర్స్ నుంచి కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. మరి అందులో భాగంగానే అతి త్వరలోనే ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ రానుంది అని టాక్ వినిపిస్తుంది. మరి అది దీనిపై అయ్యి ఉంటుందా అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
దాదాపు అయితే టీజర్ కోసమే అంతా ఎదురు చూస్తున్నారు కానీ సెకండ్ సింగిల్ పై కూడా కొన్నాళ్ల నుంచి టాక్ ఉంది. మరి మేకర్స్ వీటిలో దేనిని విడుదల చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తినా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.