ఇలా అయితే “ఆచార్య” షూట్ ఎప్పుడు.?


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే మాస్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్న ఈ చిత్రం ఇంకా కొంత భాగాన్ని చిత్రీకరించాల్సి ఉంది. ఇక ఎలాగో ఈ మధ్యనే మన తెలుగు సినిమాలు కూడా మళ్ళీ షూటింగులు పునః ప్రారంభం అవుతున్నాయి.

అలాగే ఆచార్య కూడా మొదలవుతుందని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అసలైన విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు కేవలం చిరు మీద మారియు ఇతర పలు కీలక సన్నివేశాల మీదనే జరిగింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఒక ఫీమేల్ లీడ్ రోల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

అందుకు కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపించింది. మరి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు ఎప్పుడు చిత్రీకరిస్తారు అన్న దానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. కాజల్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే హింట్స్ ఇవ్వడం లేదు. దీనితో ఈ చిత్రం షూట్ తిరిగి మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version