అలాంటివి చూస్తే రిచా ఇప్పటికీ ఏడుస్తుందంట.!

అలాంటివి చూస్తే రిచా ఇప్పటికీ ఏడుస్తుందంట.!

Published on Aug 19, 2012 1:54 PM IST


అందాల భామ రిచా గంగోపద్యాయ ‘లీడర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత ‘మిరపకాయ్’ మరియు ‘నాగవల్లి’ లాంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రిచా ఇప్పటికీ టీవీలో మనసుకు హత్తుకునే సన్నివేషాలు లేదా సెంటిమెంట్ సన్నివేశాలు చూస్తే చిన్న పిల్లల్లా ఏడ్చేస్తుందంట. నిన్న టీవీలో ప్రసారమైన ‘టైటానిక్’ సినిమా చూస్తూ ఆ సినిమాలో లియోనార్డో డి కాప్రియో మరియు కేట్ విన్స్లెట్ పడే ఇబ్బందుల్ని చూసి రిచా బోరున ఏడ్చేసిందంట. ‘ 11వ సారి ‘టైటానిక్’ సినిమా చూస్తున్నాను అయినా మొదటి సారి సినిమా చూస్తున్నట్టుగా ఏడుస్తున్నాను. జాక్ – రోస్ ల మధ్య నడిచే అద్భుతమైన ప్రేమ కథా చిత్రం ఇది’ అని రిచా ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం రిచా తెలుగులో ప్రభాస్ సరసన ‘వారధి’ సినిమాలో నటిస్తోంది మరియు త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న నాగార్జున ‘భాయ్’ సినిమాలో నటించనుంది.

తాజా వార్తలు