టాలివుడ్ అధికారిక కార్ ఇదేనా?


టాలివుడ్ కి అధికారిక కార్ అని ఏదయినా ఉంటె ప్రస్తుతం అది ఖచ్చితంగా రేంజ్ రోవర్ అవుతుంది. ప్రధాన తారలందరు ఈ కార్ ని కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఎవరెవరుకొన్నారో ఒకసారి చూస్తే ఈ మాట ఎందుకని అనవలసి వచ్చిందో మీకు అర్ధం అవుతుంది. చిరంజీవి/ రామ్ చరణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, నాగ చైతన్య, మోహన్ బాబు, మంచు మనోజ్, రాజమౌళి, BVSN ప్రసాద్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టు ఉంది.

రేంజ్ రోవర్ వాడిన వారంతా దాని మీద పూర్తి సంతృప్తితో ఉన్నారు. హైదరాబాద్ రోడ్లకి ఈ కార్ సరిపోతుందా లేదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. రేంజ్ రోవర్ లో వచ్చిన కొత్త వెర్షన్ త్వరలో విడుదల చెయ్యనున్నారు. మన తరాలు దాని మీద కూడా మక్కువ చూపిస్తారేమో చూడాలి.

90లలో పరిశ్రమలో చాలా మంది మారుతీ సుజూకి 1000 ఉపయోగించేవారు. తరువాత మిత్సుభిషి లాన్సర్ మరియు హోండా సిటి కార్లను ఉపయోగించారు. తరువాత పరిశ్రమలోకి మెర్సిడెజ్ మరియు బిఎండబల్యూలు వచ్చాయి ప్రస్తుతం రేంజ్ రోవర్ హవా నడుస్తుంది తరువాత ఏది వస్తుందో వేచి చూడాలి.

Exit mobile version