‘వార్ 2’ ట్రైలర్ రన్ టైం లాక్.. రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్!

WAR2

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ చిత్రం వార్ 2 కూడా ఒకటి. అయితే ఈ ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్ ఇపుడు బయటకి వచ్చింది. దీనితో వార్ 2 ట్రైలర్ రన్ టైం సహా ట్రైలర్ ఎప్పుడు విడుదల అనే తేదీలు తెలుస్తున్నాయి.

ట్రైలర్ రన్ టైం ఎంత?

లేటెస్ట్ గా వార్ 2 ట్రైలర్ సెన్సార్ ముంబైలో పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. మేకర్స్ 2 నిమిషాల 39 సెకండ్ల నిడివిగల ట్రైలర్ కట్ ని లాక్ చేశారట.

ట్రైలర్ విడుదల ఎప్పుడు?

ట్రైలర్ రిలీజ్ పై టాక్ మొదలు కావడంతోనే బాలీవుడ్ వర్గాలు రానున్న వారం విడుదల చేస్తారని కన్ఫర్మ్ చేశారు. అయితే లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ ప్రకారం ఈ అవైటెడ్ వార్ 2 ట్రైలర్ ని మేకర్స్ జూలై 23న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేస్తారని తెలుస్తుంది.

అంచనాలు

యష్ రాజ్ ఫిల్మ్స్ తాలూకా స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ పర్టిక్యులర్ సినిమాపై మాత్రం అంచనాలు పతాక స్థాయిలో ఉన్నాయి. పైగా ఎన్టీఆర్, హృతిక్ లు కలయిక కాబట్టి ట్రైలర్ పై మరిన్ని అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

Exit mobile version