స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’

స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’

Published on Aug 21, 2025 8:00 AM IST

గత వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ టాక్ అయితే సొంతం చేసుకోలేదు. ముఖ్యంగా తెలుగు వెర్షన్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో వసూళ్లు తగ్గాయి.

ఇక మొదటి వారం లోకి వచ్చిన తర్వాత నుంచే వార్ 2 బుకింగ్స్ పరంగా కూడా స్లో డౌన్ అయ్యింది. నిన్న బుధవారం బుకింగ్స్ కూడా కూలీ కంటే బాగా తక్కువ ఉన్నాయి. దీనితో వార్ 2 చిత్రానికి ఫైనల్ రన్ దగ్గరకి వచ్చేసినట్టే అనుకోవాలి. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా హృతిక్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు