హైదరాబాద్ కి చెందిన ఫేమస్ లెఫ్ట్ హ్యాండ్ బాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా కూడా టాలీవుడ్ పై మనసు పడింది. ఇప్పటి వరకూ రేపు బాడ్మింటన్ లో సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న జ్వాలా సరైన స్క్రిప్ట్ దొరికితే నటనలో కూడా తన టాలెంట్ చూపించాలనుకుంటోంది. ఇప్పటికే బాడ్మింటన్ ద్వారా బాగా ఫేమస్ ఉన్న జ్వాలా గుత్తా టాలీవుడ్లో జరిగే ఆడియో ఫంక్షన్స్, అవార్డు వేడుకలకి మరియు బర్త్ డే ఫంక్షన్స్ కి హాజరవుతూ ఉంటుంది.గతంలో జ్వాలా ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టం అని, తనతో నటించాలని ఉందని కూడా చెప్పింది.
ఇటీవలే హైదరాబాద్లో జరిగిన లగ్జరీ ఇండియన్ ఎక్స్ పో కర్టన్ రైసర్ కి శిల్పా రెడ్డితో కలిసి జ్వాలా కూడా వచ్చింది. జ్వాలా మీడియాతో మాట్లాడుతూ ” సరైన సినిమా లాంచ్ కోసం వేచి చూస్తున్నాను. మంచి స్క్రిప్ట్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ అయితే చాలు. ఇప్పటికే చాలా ఆఫర్లు వచ్చాయని’ అంది. ఈ బాడ్మింటన్ ప్లేయర్ కి సినిమా ఆఫర్స్ వస్తాయేమో వేచి చూడాలి.