మంచి పాత్ర కోసం ఇన్ని రోజులు ఆగానంటున్న ఫ్లాప్ హీరోయిన్

asmita_sood_hot_photo_shoot

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘బ్రహ్మిగాడి కథ’ సినిమా గుర్తుందా.. ఆ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన అస్మితా సూద్ మొదటి సినిమాతో పరజయాన్నే అందుకుంది. ఆ సినిమా వచ్చిన చాలా కాలం తర్వాత తను హీరోయిన్ గా వస్తున్న సినిమా ‘ఆడుమగాడ్రా బుజ్జి’. సుదీర్ బాబు ఈ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు.

ఎందుకింత గ్యాప్ తీసుకున్నారని అస్మితా సూద్ ని అడిగితే ‘ నా మొదటి సినిమా తర్వాత చాలా అవకాశాలొచ్చాయి కానీ ఒప్పుకోలేదు. ఎందుకంటే మంచి పాత్రలు వస్తేనే చెయ్యాలని ఇన్నాళ్ళు వేచి చూసాను. అలా ఆలోచించి చేసిన సినిమా ‘ఆడుమగాడ్రా బుజ్జి’. ఈ సినిమా నాకు హీరోయిన్ గా మంచి పేరు తెస్తుందని’ సమాధానమిచ్చింది.

అలాగే సినిమా గురించి చెబుతూ ‘ కాలేజీలో అందమైన అమ్మాయిని నేను కానీ నా వైపు చూడటానికి అబ్బాయిలు భయపడతారు ఎందుకంటే ఆ కాలేజీలో మా అన్నయ్య డాన్. అప్పుడు నన్ను ప్రేమించడం కోసమే సుదీర్ కాలేజీకి వస్తాడు. దానివెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. అది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చి ఉండవచ్చు కానీ ఇది మాత్రం భిన్నంగా ఉంటుందని’ చెప్పింది. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆలోచించి మంచి పాత్ర అని సెలెక్ట్ చేసుకున్న ఈ సినిమా అస్మితాకి హిట్ ఇస్తుందో లేదో చూడాలంటే డిసెంబర్ 5వరకు వేచి చూడాల్సిందే..

Exit mobile version