ఒకప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరొయిన్ గా ఏలిన అసిన్ బాలీవుడ్ కి వెళ్ళిన తరువాత సౌత్ సినిమాల వైపు చూడడం కూడా మానేసింది. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా అసిన్ ఆ తరువాత శివమణి, లక్ష్మి నరసింహ, ఘర్షణ, సినిమాల ద్వారా తెలుగు వారిని కూడా ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన గజిని సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆమె చేసిన కల్పన పాత్ర ఆమెని బాలీవుడ్ దాక తీసుకెళ్ళింది. ఈ సినిమాలో ఆమె నటన మెచ్చుకున్న అమీర్ ఖాన్ హిందీలో కూడా ఆమె హీరొయిన్ గా నటించాలని పట్టుబట్టి మరీ చేయించారు. ఈ సినిమా హిందీలో కూడా విడుదలై 100 కోట్లకి పైగా వసూలు చేసింది. ఆ తరువాత అడపా దడపా హిందీ సినిమాలు చేస్తున్నప్పటికీ కల్పన లాంటి పాత్రలు మళ్లీ రావడం లేదని అసిన్ బాధపడుతోంది. అలంటి పాత్రలు దొరికితే చేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని అంటోంది.