హీరో నాని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం హిట్. విశ్వక్ సేన్ సీరియస్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా దర్శకుడు శైలేష్ కొలను క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. సిన్సియర్ అండ్ సీరియస్ పోలీస్ అధికారి పాత్రలో విశ్వక్ సేన్ ఆకట్టుకోగా టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. హిట్ మూవీ ఓ నూతన పాయింట్ తో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తుంది.
హిట్ మూవీ వచ్చే నెల 28న విడుదల కానుంది. విశ్వక్ సేన్ కి జంటగా రుహాణి శర్మ నటించింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక హిట్ మూవీకి సంగీతం వివేక్ సాగర్ అందించారు. నిర్మాతగా నానికి ఇది రెండో చిత్రం గతంలో నాని, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ‘అ’ అనే చిత్రం తీశారు.
టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి