తన సినిమాకు తన డైరెక్టర్ నే ఎన్నుకొన్న విశ్వక్ సేన్.!

తన సినిమాకు తన డైరెక్టర్ నే ఎన్నుకొన్న విశ్వక్ సేన్.!

Published on Jul 17, 2020 6:27 PM IST

మన టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో కొండ తర్వాత యూత్ లో ఆ రేంజ్ ఇంపాక్ట్ కలిగించిన మరో మాస్ హీరో విశ్వక్ సేన్. రీసెంట్ గా “హిట్” చిత్రంతో మంచి అందుకున్న ఈ టాలెంటెడ్ నటుడు తమిళ్ హిట్ చిత్రం “ఓ మై కడవులే” చిత్రానికి రీమేక్ లో హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. అలాగే మన టాలీవుడ్ కు చెందిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కు మరియు విశ్వక్ కు ఎలాంటి బాండింగ్ ఉందో కూడా తెలిసిందే.

ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి మొత్తం రెండు సినిమాలకు పని చేసారు. భాగంగా ఇప్పుడు విశ్వక్ చెయ్యబోయే ఓ మై కడవులే సినిమా రీమేక్ కు గాను డైలాగ్స్ అందించడానికి నిర్మాత పివిపికు తరుణ్ భాస్కర్ పేరును సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అందుకు గాను తరుణ్ కూడా ఒప్పుకొని భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన అనంతరం మొదలు కానుంది.

తాజా వార్తలు