విశ్వరూపం DTH ప్రీమియర్ ఖరారు

Vishwaroopam
“విశ్వరూపం” చిత్రం విషయంలో కమల్ హాసన్ కాస్త వెనక్కి తగ్గారు. అదేనండి మేము చెప్పేది డి టి హెచ్ గురించి. చిత్ర విడుదల కన్నా 12 గంటల ముందే ఈ చిత్రాన్ని టీవీ లో ప్రదర్శించాలన్న కమల్ హసన్ నిర్ణయాన్ని ధియేటర్ యాజమాన్యం అనుమతించలేదు. దీంతో కమల్ హాసన్ వెనక్కి తగ్గుతారు అనుకున్నారు. అనుకున్న విధంగానే అయన ఈ ప్రీమియర్ లు తెలుగు మరియు హిందీలలో మాత్రమే ఉంటుంది తమిళ్ లో ఉండదు అని ప్రకటించారు. “ఎయిర్ టెల్ DTH సంస్థతో కలిసి పని చెయ్యడం ఆనందంగా ఉంది. ఈ ఆలోచన చాలా కుటుంబాలకు ఇంట్లోనే కూర్చొని చిత్రాన్ని ఆస్వాదించే అవకాశం ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు. కమల్ హాసన్ “విశ్వరూప్/విశ్వరూపం” చిత్రం విడుదలకు 12 గంటల ముందే అనగా జనవరి 10 రాత్రి 9 గంటలకి ప్రీమియర్ ప్రదర్శించనున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఒకసారి చూడటానికి DTH సంస్థలు 1000 రూపాయలు వసూలు చేస్తుంది. ఈ ధర ఎక్కువగా ఉండటం గురించి కమల్ హాసన్ ఫుడ్, ట్రావెల్ వంటి ఖర్చులు తగ్గిపోతాయి అని చెప్పారు. ఈ ఆలోచన ధియేటర్ లో విడుదల అయ్యే చిత్రం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Exit mobile version