ఈ సినిమా ఎవరినీ బాధించదు

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో మరియు హీరోగా రూపొందించిన చిత్రం ‘విశ్వరూపం’. ఈ సినిమాలో టెర్రరిజం గురించి చూపిస్తున్నారు అది ఎ కమ్యూనిటీనైనా బాధపెట్టేలా ఉంటుందా? అని కమల్ ని అడిగితే ఆయన సమాధానమిస్తూ ‘ మేము ఏ మతాన్ని/ ఏ దేశాన్ని ఉద్దేశించి మరియు కించపరిచేలా ఈ సినిమా తీయలేదు. స్వతహాగా నేను గాంధేయవాదిని. ఈ సినిమాలో కొత్త టెర్రరిజంకి సంబందించిన కొన్ని సన్నివేశాలు ఉండడంతో సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో టెర్రరిజంపై ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధం చెప్పాలని ప్రయత్నించాను. ఇది చూసి ప్రపంచ ప్రభుత్వాలు ఏమన్నా చేయగలరేమో చూడాలి అని’ అన్నారు.

ఈ సినిమాలో సరికొత్త సౌండ్ టెక్నాలజీ ‘ఆరో 3డి’ ని ఉపయోగించాము. జార్జ్ లుకాస్ ప్రొడక్షన్ సంస్థ వారు ఉపయోగించిన తర్వాత ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఉపయోగించిన రెండవ సినిమా ‘విశ్వరూపం’ కావడం విశేషం. కమల్ హాసన్ కథ మరియు స్క్రీన్ ప్లే బాగుంటాయి కనుక ఈ సినిమా కోసం చాలా ఆసక్తి కరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.

Exit mobile version