‘విశ్వరూపం’ ఆగష్టు చివరి వారంలో రానుందా?

‘విశ్వరూపం’ ఆగష్టు చివరి వారంలో రానుందా?

Published on Jul 19, 2012 3:13 PM IST


సౌత్ ఇండియన్ విలక్షణ నటుడు మరియు యూనివర్సల్ హీరో కమల్ హాసన్ రెండు విభిన్న గెటప్పుల్లో రానున్న చిత్రం “విశ్వరూపం”. ఈ చిత్రాన్ని ఆగష్టు చివరి వారం విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఇది వరకే తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జూలై 24న చేయనున్నారని ప్రచారం జరుగుతోంది, కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇంటర్నేషనల్ టెర్రరిజం నేపధ్యంలో తెరకక్కుతున్న ఈ చిత్రంలోని ప్రముఖ నటులంతా రెండు విభిన్న గెటప్పు ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో కమల్ తో పాటు పూజా కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియా జరేమియా, శేఖర్ కపూర్ మరియు జైదీప్ అహ్లావత్ లు ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత మరియు దర్శకత్వం కూడా కమల్ హాసన్ గారే వహిస్తున్నారు. పి.వి.ఆర్ సినిమా వాళ్ళు సహా నిర్మాతలుగా వ్యహరిస్తున్న ఈ చిత్రానికి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి విడుదల చేయనున్న ఈ చిత్ర తెలుగు డబ్బింగ్ రైట్స్ ఇంకా అమ్ముడు పోలేదు.

తాజా వార్తలు