తమిళ్ లో ఖరారైన విశ్వరూపం రిలీజ్ డేట్

Vishwaroopam

సుమారు పది రోజుల పలు విషయాలతో సతమతమవుతున్న కమల్ హాసన్ చివరికి వాటినుండి బయటపడ్డాడు. గత కొన్ని రోజులుగా కమల్ తీసిన విశ్వరూపం సినిమా తమిళనాడులో రిలీజ్ కాకుండా పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల చేయడానికి ముస్లీం గ్రూప్స్ ఒప్పుకున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని అలాగే కొన్ని చోట్ల డైలాగ్స్ ని మ్యూట్ చేసి రిలీజ్ చేయడానికి అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా కమల్ రాసిన లేఖలో ముఖ్య మంత్రి జయలలితకి, అలాగే తనకు సపోర్ట్ ఇచ్చిన మీడియాకి, తన ఫాన్స్ కి ధన్యవాదాలు తెలిపారు.

కమల్ బాగా ఆశ్చర్యానికి గురైన విషయం ఏమిటంటే తన క్లిష్టమైన పరిస్థితుల్లో తెలుసుకొని తనకి చాలా మంది కొన్ని వేల రూపాయలకి చెక్కులు పంపించారు. వారి చెక్కులను వారికి తిరిగి ఇచ్చేస్తున్నానని కూడా ఇందులో తెలిపాడు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ లో ఇటీవల ఏ సినిమా రిలీజ్ కానంత విధంగా సుమారు 600 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

Exit mobile version