ఆయన విశ్వరూపం చూడనున్న థాయిలాండ్


కమల్ హాసన్ ఈ యేడు మొదట్లో తను తీసి సంచలనం సృష్టించిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘విశ్వరూపం’కు తరువాయి భాగం చిత్రీకరించే పనిలో వున్నాడు.ఈ సినిమా అంతర్జాతీయ ఉగ్రవాదం నేపధ్యంలో సాగుతుండగా సమాచారం ప్రకారం ‘విశ్వరూపం 2’ సినిమా షూటింగ్ ఈ వారంనుండి థాయిలాండ్ లో మొదలుకానుంది. మొదటి భాగంలో ముఖ్య పాత్రలు పోషించిన పూజా కుమార్, రాహుల్ బోస్ మరియు శేఖర్ కపూర్ ఈ భాగంలో కుడా నటిస్తున్నారు. కమల్ ఈ సినిమాకు దర్శకత్వం, నిర్మాణం వహించడమే కాక స్క్రిప్ట్ బాధ్యతలు కూడా చేపట్టాడు. శంకర్-ఎశాన్-లాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు

Exit mobile version