పిక్ టాక్ : ‘విశ్వంభర’ కోసం అదిరిపోయే పాటను పట్టుకొస్తున్న మెగాస్టార్.. లాస్ట్ షెడ్యూల్ షురూ!

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ గతంలోనే షూటింగ్ ముగించుకుని రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక రీసెంట్‌గా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్‌ను త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక ఆయన అన్నట్లుగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ సాలిడ్ అప్డేట్ పట్టుకొచ్చాడు.

‘విశ్వంభర’లో ఓ సాంగ్ షూటింగ్ బాకీ ఉందని తెలిపిన ఆయన, తాజాగా ఈ సాంగ్ షూట్ ప్రారంభించినట్లు ప్రకటించారు. సెట్స్‌లో ఈ పాట షూట్ చేస్తున్న ఓ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సినిమాలో ఈ పాటను వెండితెరపై చూసిన తర్వాత అభిమానులు పండగ చేసుకోవడం ఖాయమని.. ఈ పాటలో బాసు గ్రేస్‌కు అభిమానులు ఫిదా కావడం ఖాయమని ఆయన అన్నారు. ఇక ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version