ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్.. ఎందులో అంటే!

Aaryan

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన మరో క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఆర్యన్” కూడా ఒకటి. ఈ సినిమాని దర్శకుడు ప్రవీణ్ కె తెరకెక్కించగా తమిళ్ లో మంచి హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇపుడు మూడు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగులో ఓ మోస్తరు టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి తెలుగు, తమిళ్ సహా హిందీ, కన్నడ ఇంకా మలయాళ భాషల్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునే వారు నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి చూడొచ్చు. ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, మానస చౌదరి అలాగే సెల్వ రాఘవన్ లు కీలక పాత్రల్లో నటించగా ఘిబ్రాన్ సంగీతం అందించాడు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version