ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’

ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’

Published on Nov 22, 2025 10:00 PM IST

తమిళ హీరో విష్ణు విశాల్ నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ఆర్యన్’ ప్రేక్షకులను మెప్పించడంలో అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన కొద్దిరోజుల్లోనే థియేటర్ల నుంచి నిష్క్రమించింది. ఈ సినిమాను విశ్ణు విశాల్ స్టూడియోస్, శుభ్రా & ఆర్యన్ రమేశ్ కలిసి నిర్మించగా ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. నవంబర్ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో సెల్వరాఘవన్ విలన్‌గా కనిపించారు.

శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి కీలక పాత్రలు పోషించగా.. సాయి రోనక్, తనక్ పొన్నప్ప, మాలా పార్వతి, అవినాష్, అభిషేక్ జోసఫ్ జార్జ్ వంటి వారు కూడా చిత్రంలో భాగమయ్యారు. గిబ్రాన్ సంగీతం అందించిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు