వైరల్ వీడియో: ప్రియాంక చోప్రాతో రాజమౌళి కొడుకు స్టెప్పులు..

వైరల్ వీడియో: ప్రియాంక చోప్రాతో రాజమౌళి కొడుకు స్టెప్పులు..

Published on Nov 22, 2025 5:06 PM IST

లేటెస్ట్ గా వరల్డ్ సినిమా దగ్గరే సెన్సేషన్ గా మారిన ఇండియన్ సినిమానే వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఈ సినిమా జస్ట్ కాన్సెప్ట్ వీడియోతోనే అందరికీ కనెక్ట్ అయ్యింది. ఇలా అక్కడ నుంచి వారణాసి కాంబినేషన్ హాట్ టాపిక్ గా నిలవగా లేటెస్ట్ గా ఈ సినిమా దర్శకుడు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ అలాగే హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిసి ఆనందంగా డాన్స్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్వయంగా ప్రియాంక చోప్రా ఈ వీడియో పోస్ట్ చేసి కార్తికేయ బర్త్ డే వేడుకల్లో ఆనందంగా గడిపినట్టు తెలిపారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక వీరి సినిమాలో ప్రియాంక మందాకినీగా నటిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే 2027 వేసవి కానుకగా మేకర్స్ సినిమాని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు