న్యూ జెర్సీ నుండి రౌడీ ట్రైలర్ ను విడుదలచేయనున్న విష్ణు

vishnu
రామ్ గోపాల్ వర్మ ‘రౌడీ’ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ అంచనాలను ట్రైలర్ తోనే అందుకోగలమని నిర్మాతలు నమ్మకంగా వున్నారు. అమెరికాలో వున్న మంచు విష్ణు ఈ ట్రైలర్ ను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్లు సమాచారం

ఈ సినిమాను రాము రాయలసీమ నేపధ్యంలో హై యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు. ఇప్పటివరకూ చూడని తరహాలో మోహన్ బాబును తన బాబు విష్ణు ని చూపించానున్నాడు

30ఏళ్ళ కెరీర్, 500 సినిమాలలో నటించిన మోహన్ బాబు ఈ లుక్ లో నిజంగా రౌడీలాగా వున్నాడంటే ఆ పాత్రను అంత అందంగా మలచిన రాముకే ఆ క్రెడిట్ అంతా చెందాలి. అంతేకాక చాలాకాలం విరామం తరువాత మోహన్ బాబు, జయసుధ కలిసి నటించడం విశేషం

గత మూడు సినిమాలుగా విజయపరంపరలో దూసుకుపోతున్న విష్ణుకూడా ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంటుంది

Exit mobile version