కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు తనయుడిగా పరిచయమైన హీరో మంచు విష్ణు కూడా ఎన్.టి.ఆర్ తో పాటే బ్యాంకాక్‌లో ఉన్నారు. ప్రస్తుతం విష్ణు మరియు ఎన్.టి.ఆర్ సినిమాలు బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ‘ అన్నయ్య విష్ణు ‘దేనికైనా రెడీ’ సినిమా పాట బాంకాక్లో చిత్రీకరిస్తున్నారు. అన్నయతో పాటు నేను కూడా బ్యాంకాక్‌లో ఉన్నాను మరియు బాంకాక్లో శ్రీను వైట్ల మరియు ఎన్.టి.ఆర్ లను కలిసాను. చాలా రోజుల తర్వాత తారక్ ని కలిసాను, అప్పటికీ ఇప్పటికీ తారక్ లో ఎలాంటి మార్పులేదు. తారక్ తన భార్యతో ప్రేమలో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని’ మంచు మనోజ్ ట్వీట్ చేసారు.
ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘బాద్షా’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను ప్రస్తుతం బాంకాక్లో చిత్రీకరిస్తున్నారు, అలాగే విష్ణు నటిస్తున్న ‘దేనికైనా రెడీ’ సినిమా చిత్రీకరణ కూడా బాంకాక్లో జరుగుతోంది. మామూలుగా మోహన్ బాబు కుటుంబానికి మరియు ఎన్.టి.ఆర్ కుటుంబానికి మంచి సన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరి హీరోల అనుకోని కలయిక వారికి ఎంతో ఆనందాన్ని కలుగజేసింది.