చిరు సినిమాలు మిస్ అవుతున్న విష్ణు.!

చిరు సినిమాలు మిస్ అవుతున్న విష్ణు.!

Published on Nov 28, 2012 11:05 AM IST


తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకానిక్ నటులలో ఒకరైన మెగా స్టార్ చిరంజీవి సినిమాలంటే హై వోల్టేజ్ హీరోయిజం మరియు ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. ప్రస్తుతం చాలా మంది సినిమా లవర్స్ ఇండస్ట్రీలో చిరంజీవిని మిస్ అవుతున్నారు మరియు ఆయన మళ్ళీ సినిమాల్లో నటించాలనే డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ‘దేనికైనా రెడీ’ సినిమాతో హిట్ కొట్టిన మంచు విష్ణు కూడా చిరంజీవి సినిమాలను బాగా మిస్ అవుతున్నానని అంటున్నాడు. యంగ్ హీరో విష్ణు చిరంజీవిని చెన్నై ఎయిర్ పోర్ట్ లో కలిసి కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.

అదంతా పూర్తయిన తర్వాత ‘ ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి అంకుల్ ని కలిసాను, ఆయనతో చేసిన చిట్ చాట్ చాలా సూపర్బ్ గా ఉంది. అందరి సినీ ప్రేమికుల్లాగానే నేను కూడా చిరంజీవి గారి సినిమాల్ని బాగా మిస్ అవుతున్నానని’ విష్ణు ట్వీట్ చేసాడు. గత కొద్ది రోజుల క్రితం మాకు విష్ణు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో చిరంజీవి మరియు డా. మోహన్ బాబు తో కలిసి సినిమా చేయాలనుందనే తన మదిలోని మాటని బయట పెట్టాడు. వారిద్దరికీ సరిపోయే కథని తీసుకెళ్ళి ఒప్పించి సినిమా తీసి తెలుగు మూవీ లవర్స్ కి విష్ణు మంచి ట్రీట్ ఇవ్వాలని ఆశిద్దాం.

మంచు విష్ణు పాత ఇంటర్వ్యూ కోసం – ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు