నెక్స్ట్ మూవీ కోసం లాస్ ఏంజెల్స్ లో షాపింగ్ చేస్తున్న విష్ణు మంచు

Vishnuvardhan-Viranica-(2)
ఈ మధ్య కాలంలో మంచు విష్ణు చాలా బిజీగా ఉంటున్నారు. “దేనికయినా రెడీ” చిత్ర విజయం తరువాత ఈ నటుడు కాస్త విరామం తీసుకున్నారు. వీరు పొట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కోసం అయన సంసిద్దమవుతున్నారు. ఈ చిత్రం కోసం అయన అమెరికా బెవెర్లి హిల్స్ లో షాపింగ్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ట్రెండ్స్ ని గమనిస్తూ ఈ పాత్రకి సరిపోయే దుస్తులను కొనుగోలు చేస్తున్నారు.”నన్ను ట్రెండ్ ఆకర్షిస్తుంది కాని బడ్జెట్ అడ్డొస్తుంది ప్రస్తుతం రాబోయే చిత్రం కోసం లాస్ ఏంజెల్స్ లో షాపింగ్ చేస్తున్నాను” అని విష్ణు చెప్పారు. ఈ చిత్రం 2013 లో మొదలు కానుంది విష్ణు ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మీద నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయిక కోసం వెతుకుతున్నారు ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు. ఇది కాకుండా విష్ణు అయన డ్రీం ప్రాజెక్ట్ “రావణ బ్రహ్మ” చిత్రం ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు.

Exit mobile version