చైనాలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న మంచు విష్ణు


విష్ణు మంచు చైనాలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కుంటున్నారు. “దేనికయినా రెడీ” చిత్రంలో పాటల చిత్రీకరణ కోసం లొకేషన్లను చూడటానికి అక్కడికి వెళ్ళిన ఆయనకి అక్కడ అతి పెద్ద సమస్య ఆహరం అయ్యింది. “చైనాలో చైనీస్ ఫుడ్ దొరకట్లేదు ఇంటికి వచ్చాక ఇక్కడి ఫుడ్ ని మిస్ అవుతానేమో ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అసలు బాగోలేదు. మెక్ డోనాల్డ్ మరియు కే ఎఫ్ సి ఎకువగా ఉన్నాయి” అని కొన్ని రోజుల క్రితం ట్విట్టర్లో అన్నారు. తరువాత మరో రోజు అక్కడ జనం పాములను తినడానికి ఎంచుకొనడం చూసి ఆశ్చర్యపోయారు ” ఒక చైనీస్ రెస్టారెంట్ కి వెళ్ళాను సముద్రపు ఆహరం దొరుకుతుంది అక్కడ చేపలు, పీతలు ఇంకాస్త ముందుకెళ్తే అక్కడ బకెట్ నిండుగా పాములు ఉన్నాయి వాటిలో నుండి జనం తినడానికి ఎంపిక చేసుకుంటున్నారు. యాక్” అని అన్నారు. లొకేషన్ లను చూడటమే కాకుండా “రావణ బ్రహ్మ” చిత్రం కోసం మార్షల్ ఆర్ట్స్ నిపుణులను కూడా సంప్రదిస్తున్నారు.

Exit mobile version