మంచు విష్ణు ,హన్సిక రాబోతున్న తమ మల్టీ స్టారెర్ చిత్రం కోసం ఇటలీ లోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్నారు . ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యొక్క ప్రధాన షూటింగ్ కొన్ని రోజుల క్రితం స్లోవేనియా లో ప్రారంభమైంది తర్వాత ఈ చిత్ర బృందం ఇటలీ కి బయలుదేరింది . విష్ణు ,హన్సిక ల పై ఒక పాట చిత్రీకరణ జరుగుతుంది విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పాట వెనిస్ ,పిరాన్ లో జరగనుంది . ఈ పాట చిత్రీకరణ ని విష్ణు ,హన్సిక లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ట్వీట్స్ కూడా ఈ విషయాన్నే తెలుపుతున్నాయి . శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ,మంచు మనోజ్ ,తనిష్ ,వరుణ్ సందేశ్,ప్రణితా సుభాష్ ,రవీనా టాండన్ కూడా నటించనున్నారు . విష్ణు మరియు మనోజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . ఎం .ఎం కీరవాణి తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు ఈ ఏక్షన్ ఎంటర్టైనర్ కి సంగీతాన్ని అందిస్తున్నారు .