‘ఇంద్రుడు’గా రానున్న విశాల్

indrudu

చెప్పుకోవడానికి తెలుగువాడే అయినా మొదట తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం వల్ల విశాల్ తెలుగు వారికి తమిళ హీరోగానే పరిచయం అయ్యాడు. ‘పందెం కోడి’, ‘పొగరు’, ‘భరణి’ చిత్రాలతో తెలుగులో బాగానే క్రేజ్ తెచ్చుకున్న విశాల్ తన ప్రతి సినిమాని తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. విశాల్ హీరోగా నటించిన సినిమా ‘నాన్ సిగప్పు మనిదన్’. ఈ సినిమాని తెలుగులో ‘ఇంద్రుడు’గా రిలీజ్ చేయనున్నారు.

దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా రెండు పాటలను మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. ఆ రెండు పాటలను త్వరలోనే థాయ్ ల్యాండ్ లో షూట్ చేయనున్నారు. విశాల్ సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి తిరు డైరెక్టర్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాని యుటివి మోషన్ పిక్చర్స్ – విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని చూసిన రన్ దీర్ కపూర్ హిందీలో రీమేక్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.

Exit mobile version