చరణ్ కోసం ఊటీకి వెళ్ళిన వినాయక్, తమన్

చరణ్ కోసం ఊటీకి వెళ్ళిన వినాయక్, తమన్

Published on Feb 29, 2012 4:14 PM IST


ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం ఊటీలో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారు. వినాయక్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కోసం పాటలు ఎంపిక ఊటీలో చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. వినాయక్ ఈ సినిమా కోసం ప్రత్యేక శ్రద్ధా తీసుకొని పాటలు ఎంపిక చేస్తున్నారు. చరణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా వినాయక్ కథని సిద్ధం చేసినట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం ఇప్పటికే చోట కె నాయుడు యూరప్ లోని లోకేషన్ల కోసం వెతుకుతున్నారు. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర రెండో షెడ్యుల్ త్వరలో ప్రారంభం కానుంది.

తాజా వార్తలు