రామానాయుడులో వినాయక్ – సమంతల మూవీ సందడి

రామానాయుడులో వినాయక్ – సమంతల మూవీ సందడి

Published on Feb 20, 2014 10:00 AM IST

Samantha-&-Bellamkonda-Sree
అందాల భామ సమంత ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతోంది. స్ట్రీట్ లో వచ్చే సన్నివేశాలను హీరో, హీరోయిన్ పై షూట్ చేస్తున్నారు.

బెల్లంకొండ సురేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. తన కుమారుడి తొలి సినిమా కావడం వల్ల సినిమాకి భారీగానే ఖర్చు పెడుతున్నాడు. అలాగే సినిమాకి భాగా క్రేజ్ తేవడం కోసమే వినాయక్, సమంతలను ఈ సినిమాకి ఒప్పించాడు.

శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడని అంటున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీం జపాన్ లోని అందమైన లోకేషన్స్ లో పాటలు షూట్ చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చాయి.

సాయి శ్రీనివాస్ హీరోగా చేయడంకోసం చాలా నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. అలాగే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. దానికోసం వినాయక్, సమంతల ఇమేజ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది.

తాజా వార్తలు