విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా, యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటించిన ‘శివతాండవం’ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో నటీనటుల డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఎకోలేషణ్ టెక్నిక్ లో సిద్దహస్తుడైన అంధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నారు. ఈ పాత్రను ఎకోలేషణ్ టెక్నిక్ లో ఆరితేరిన డానియల్ క్రిష్ అనే అంధుడిని స్పూర్తిగా తీసుకుని చేసారు. ఈ చిత్రంలో జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి కళ్యాన్ నిర్మించారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోన్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్దమవుతోంది. విక్రమ్ అంధుడిగా కనిపించనున్న ఈ చిత్రం పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.