విక్రమ్ ‘మనోహరుడు’ గా రానున్నాడా?

విక్రమ్ ‘మనోహరుడు’ గా రానున్నాడా?

Published on Aug 19, 2012 5:20 PM IST


అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. ‘అపరిచితుడు’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ మరియు విలక్షణ నటుడు విక్రమ్ కలిసి ఒక చిత్రం చేయనున్నారు. తమిళంలో ఈ చిత్రానికి ‘ఐ’ అనే టైటిల్ పెట్టారు, ఈ చిత్రానికి తెలుగులో ‘మనోహరుడు’ అనే పేరుని ఖరారు చేసారని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించనున్నారు, అందులో ఒక కథానాయికగా అమీ జాక్సన్ ఎంపిక కాగా మరో కథానాయిక ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రం కోసం మొట్ట మొదటి సారిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ మరియు శంకర్ కలిసి పనిచేయనున్నారు. ఆస్కార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మళయాళ నటుడు సురేష్ గోపి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

విక్రమ్ నటించిన ‘శివ తాండవం’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విక్రమ్ తో పాటు అనుష్క, జగపతి బాబు మరియు అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు