తెలుగులోకి అనువదించబడుతున్న విక్రం ప్రభు కుమ్కి


శివాజీ గణేసన్ మనవడు అయిన విక్రం ప్రభు తెలుగులో “కుమ్కి” చిత్రంతో పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి ప్రభు సోలోమన్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో ఈయన “మైనా” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని తెలుగులోకి “ప్రేమ ఖైది” అన్న పేరుతో అనువదించారు. ఈ చిత్రంలో విక్రం ఒక ఏనుగుని పెంచుకునే పాత్రలో కనిపించనున్నారు ఈ ఏనుగు పేరు కుమ్కి. లక్ష్మి మీనన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం కేరళ మరియు తమిళనాడులోని దట్టమయిన అడవుల్లో చిత్రీకరించారు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ కానుంది. ఎన్ లింగుస్వామి ఈ చిత్ర తమిళ్ వెర్షన్ ని నిర్మించారు ఈ మధ్యనే ఈ చిత్ర దక్షిణాది డిస్ట్రిబ్యుషన్ హక్కులను స్టూడియో గ్రీన్ బ్యానర్ సొంతం చేసుకుంది. జ్ఞానవేల్ రాజ గతంలో “యుగానికి ఒక్కడు”, “అవార” మరియు “నా పేరు శివ” వంటి చిత్రాలను నిర్మించారు. ఇమాం సంగీతం అందించగా సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version