ఏమైతేనేం విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం

ఏమైతేనేం విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం

Published on Dec 22, 2020 3:00 AM IST

స్టార్ నటుడు విజయ్ సేతుపతి కేవలం తమిళ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషల మీద కూడ దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే తెలుగులో సినిమాలు చేస్తున్న ఆయన బాలీవుడ్ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం అయితే సేతుపతి ఆమిర్ ఖాన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో ఒక కీ రోల్ చేయాల్సింది. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’కు ఇది రీమేక్. కానీ కొన్ని కారణాల వలన సేతుపతి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇంతలోనే ఆయనకు ఇంకో ఆఫర్ వచ్చిందట.

అయితే ఈసారి వెబ్ సిరీస్. పాపులర్ యంగ్ హీరో షాహిద్ కపూర్ చేయనున్న వెబ్ సిరీస్ నందు సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేయనున్నారు. దీన్ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేయనున్నారు. గతంలో వీరు చేసిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ భారీ విజయాన్ని దక్కించుకుంది. సో.. ఆమిర్ ఖాన్ సినిమాతో మిస్సైన బాలీవుడ్ డెబ్యూ అవకాశం ఆయనకు ఈ వెబ్ సిరీస్ ద్వారా అందిందన్నమాట. ఇకపోతే విజయ్ తమిళంలో నాలుగు సినిమాలు చేస్తున్నారు. అలాగే తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేశారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకానుంది.

తాజా వార్తలు