తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో పలువురు స్టార్స్ కేమియో పాత్రల్లో నటిస్తారని చిత్ర యూనిట్ గతంలోనె వెల్లడించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గోవాలో సేతుపతి సీన్లను చిత్రీకరిస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్.
అయితే, ఈ సినిమాలో విజయ్ సేతుపతి నిజంగానే నటిస్తున్నాడా అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గతంలో రజినీకాంత్-విజయ్ సేతుపతి గతంలో కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ‘పెట్టా’ చిత్రంలో కలిసి నటించారు.
