‘పిశాచి 2’పై ఆండ్రియా వైరల్ కామెంట్స్..!

andrea jeremiah 1 1

దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ‘పిశాచి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాచి 2’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్ చిత్రంలో అందాల భామ ఆండ్రియా జెరెమియా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది.

కాగా, ఇప్పుడు ఈ సినిమాపై ఆండ్రియా కొన్ని వైరల్ కామెంట్స్ చేసింది. ‘పిశాచి 2’ సినిమాలో ఎలాంటి న్యూడిటీ లేదని.. కానీ ఎరోటిక్ సీన్స్ ఉన్నాయని ఆమె తెలిపింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి కేమియో పాత్రలో కనిపించనుండగా పూర్ణ, సంతోష్ ప్రతాప్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. రాక్‌ఫోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేస్తు్న్న ఈ సినిమాకు కార్తిక్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version