కోలీవుడ్ వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ ప్రక్క సోలో హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఇతర హీరోల సినిమాలలో ప్రాధాన్యం ఉన్న రోల్స్ చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ మూవీ సైరా లో ఆయన తమిళనాడు ప్రాంతానికి చెందిన ఓ వీరుడి పాత్ర చేశారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తదుపరి చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడు. కాగా విజయ్ సేతు పతి బన్నీ సినిమాలో కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఐతే విజయ్ సేతుపతి పాత్ర ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కాగా విజయ్ సేతుపతి బన్నీకి విలన్ గా చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తున్న సమాచారం. ఇదే కనుక నిజం ఐతే విజయ్ మరియు బన్నీ ల మధ్య నడిచే రైవల్ డ్రామా ఓ రేంజ్ లో తెరపై పేలడం ఖాయం. ఇక బన్నీ ఫిబ్రవరిలో మొదలుకానున్న ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ నందు పాల్గొననున్నారు. బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.