విజయ్ సినిమాను పాన్ ఇండియన్ రిలీజ్ చేసేసారుగా!

విజయ్ సినిమాను పాన్ ఇండియన్ రిలీజ్ చేసేసారుగా!

Published on Dec 26, 2020 12:30 AM IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మాస్టర్”. ఎప్పుడో కంప్లీట్ చేసేసిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల చాలా కాలం డిలే అయ్యింది. కానీ ఎట్టకేలకు ఇప్పుడు మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యడానికి సిద్ధం చేసారు. అయితే ఈ సినిమాకు తమిళ్ లో ఎలాగో భారీ హైప్ ఉంది అలాగే తెలుగులో కూడా మంచి అంచనాలు నెలకొల్పుకుంది.

కానీ మేకర్స్ ఇప్పుడు ఏకంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ విడుదలకే ప్లాన్ చెయ్యడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఒక్క తమిళ్ మరియు తెలుగు భాషల్లోనే కాకుండా ఈ చిత్రాన్ని హిందీ మరియు కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ సిద్ధం చేసేసారు. అలాగే ఇప్పటికే హిందీ వెర్షన్ రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

మొత్తానికి మాత్రం జస్ట్ తమిళ్ వెర్షన్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రాన్ని ఫైనల్ గా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా మార్చేశారు. మరి విజయ్ కు ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఏ రేంజ్ హిట్ అయ్యిందో తెలిసిందే.

తాజా వార్తలు