దయచేసి నిజం చెప్పమంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్

దయచేసి నిజం చెప్పమంటున్న స్టార్ హీరో ఫ్యాన్స్

Published on Nov 11, 2020 2:01 AM IST


తమిళ స్టార్ హీరోల అభిమానులు సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే విడుదలైన వాతి కమింగ్ పాట బాగా క్లిక్ అయింది. కానీ అప్డేట్ వచ్చి చాలా రోజులే అవుతుండటంతో అభిమానులు అప్డేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి నుండి దీపావళికి సినిమా నుండి పెద్ద అప్డేట్ రానుందని, అదే టీజర్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి జరుగుతోంది.

నోటెడ్ పర్సన్స్ నుండి ‘మాస్టర్’ టీజర్ సూన్ అంటూ ట్వీట్స్ రావడంతో హడావిడి మరింత ఊపందుకుంది. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. దీంతో ఇంతకీ దీపావళికి టీజర్ అనే వార్త నిజమా కాదా, దయచేసి నిజం చెప్పండి, మమ్మల్ని ఆశ పెట్టి నిరాశపరచకండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ప్రచారం మీద నిర్మాణ సంస్థ స్పందించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా స్టార్ నటుడు విజయ్ సేతుపతి నటించారు. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలచేసే అవకాశం ఉన్నా థియేటర్లు పూర్తిగా తెరుచుకున్నాకే నిర్మాతలు తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

తాజా వార్తలు