ఏప్రిల్ నుండి విజయ్ దేవరకొండతోనే శివ నిర్వాణ ?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా తరువాత రెండు సినిమాలను లైన్ లో పెట్టుకున్నాడు.శివ నిర్వాణతో ఒక సినిమా, సుకుమార్ తో మరో సినిమా. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ముందుగా మొదలవ్వతుందని విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం శివ నిర్వాణ నానితో ‘టక్ జగదీష్’ చిత్రాన్ని చేస్తున్నారు. సుకుమార్ పుష్పతో బిజీగా ఉన్నారు. పుష్ప మరో ఐదు నెలలు పడుతుంది. కానీ ఫిబ్రవరి నాటికి శివ నిర్వాణ సినిమాతో పాటు విజయ్ చేస్తోం ఫైటర్ సినిమా కూడా పూర్తవుంతుందట. దాంతో వచ్చే ఏప్రిల్ నుండి విజయ్ – శివ చిత్రం పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక వీరి సినిమా ఆర్మీ నేపథ్యంలో ఉంటుందని, అందులో విజయ్ మేజర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

అలాగే ఇందులో ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కూడ ఉంటుందట. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రెస్. అయన గత చిత్రాలు ‘మజిలీ, నిన్ను కోరి’లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడ మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ. మరి ఆర్మీ నేపథ్యంలో సాగే ఆ ప్రేమ కథ ఎలా ఉంటుందో పూర్తిగా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక విజయ్ దేవరకొండ ఫైటర్ షూటింగ్ త్వరలో హైదరాబాద్లో రీస్టార్ట్ కానుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో డైరెక్టర్ పూరి వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు.

Exit mobile version