వృద్ధి స్టూడియోస్ నుంచి రాజేష్ ధ్రువ నటించిన ‘పీటర్’ చిత్ర టీజర్ ఆవిష్కరణ

Peter

రాజేష్ ధ్రువ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘పీటర్’ టీజర్‌ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. వృద్ధి స్టూడియోస్ పతాకంపై రవి హిరేమత్, రాకేష్ హెగ్గడే నిర్మించిన ఈ చిత్రానికి సుకేష్ శెట్టి రచన, దర్శకత్వం వహించారు. జాన్వి రాయల, రవిక్ష శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

“జెస్సీ మళ్లీ వచ్చింది.. డెవిడ్‌ను ఇక్కడకు తీసుకురా.. చెండే వాయిద్యం అంటే మాకు దైవంతో సమానం..” అంటూ సాగిన టీజర్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. టీజర్‌లో కేరళ సంప్రదాయాలు, అక్కడి సుందరమైన దృశ్యాలను అద్భుతంగా చూపించారు. భయపెట్టే కెమెరా యాంగిల్స్, వెంటాడే నేపథ్య సంగీతం, ఆసక్తికరమైన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఈ చిత్రంలో రాజేష్ ధ్రువ ఎంతో ఇంటెన్స్‌తో కూడిన భావోద్వేగ ప్రదర్శన ఇవ్వబోతున్నాడని టీజర్ స్పష్టం చేసింది. గురుప్రసాద్ నార్నాడ్ కెమెరా పనితనం విజువల్స్‌కి సహజత్వాన్ని ఇవ్వగా, రిత్విక్ మురళీధర్ సంగీతం భయం, ఉత్కంఠను పెంచేలా ఉంది. ఎడిటర్ నవీన్ శెట్టి కట్స్ కథనంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘పీటర్’ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version